routhu surya prakash rao
-
రాజమండ్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా రౌతు సూర్యప్రకాష్‌రావు నామినేషన్
-
ఫారం-7 పేరుతో తప్పుడు కేసులు: రౌతు
తూర్పుగోదావరి : ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశ రావు మాట్లాడుతూ.. ఫారం-7 పేరుతో వైఎస్సార్సీపీకి చెందిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారేందుకు అంగీకరించని వారిని రాజమహేంద్రవరంలో టీడీపీ నాయకులు కేసులతో భయపెడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ఓటర్లు అసలు పోలింగ్ బూత్‌లకే రాకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారని రౌతు ఆరోపించారు. -
జగన్ దృష్టికి పోలింగ్ పరిస్థితి : బాబిరెడ్డి
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ పరిస్థితిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలిసి వివరించామని పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు సబ్బెళ్ల బాబిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం అక్కడి నుంచి ఫోన్లో రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై ఓ నివేదిక అందజేశామన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గంలోని అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రాజానగరం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్న విషయాన్ని జగన్మోహన్రెడ్డికి వివరించామన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్యే రౌతు
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి రౌతును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రౌతు సూర్యప్రకాశరావు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఒక నిబద్ధత, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకత్వం కలిగిన జగన్ వల్లే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకేసారి అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలాంటి సువర్ణ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, అది జగన్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తనకు వైఎస్ఆర్తో 25 ఏళ్ల రాజకీయ అనుబంధముందని గుర్తుచేశారు. వైఎస్ వల్లే తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, అయితే వైఎస్సార్ సీపీలోకి రావడానికి కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిశ్చయించి వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని, వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయనున్న బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజుల విజయానికి సహాయపడతానని చెప్పారు. అలాగే రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి విజయానికి కృషి చేస్తానన్నారు. కర్నూలు నేతల చేరిక కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డిలు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు డా.నౌమాన్ కూడా జగన్‌ను కలుసుకున్నారు. -
కిరణ్ ‘మృదంగం’వినలేక..
సాక్షి ప్రతినిధి, కాకినాడ :విశ్వసనీయత.. ఈ పదం వినిపించగానే రాజకీయాల్లో గుర్తుకువచ్చే వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. మాట తప్పకుండా మడమ తిప్పకుండా వ్యవహరించిన వ్యక్తిత్వమే ఆయనను మహానేతగా నిలిపింది. అది లోపించబట్టే నేటి నేతలపై అనుచరులకే నమ్మకం లేకుండా పోతోంది.నిన్నటి వరకూ ముఖ్యమంత్రిగా ఉండి విభజనకు చక్రం అడ్డేస్తానని గప్పాలు కొట్టుకున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు విడిపోయిన రెండు రాష్ట్రాలను కలిపేస్తానం టూ కొత్తగా సమైక్యాంధ్ర పార్టీని ప్రకటించి నేడు రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహణకు సిద్ధపడ్డారు. ఇప్పటి వరకూ ఆయన వెన్నంటి ఉన్న నాయకుల్లో చాలామంది ఈ పార్టీకి, సభకు దూరంగా ఉంటున్నారు. ఈ పార్టీ గురించి మొట్టమొదట ప్రకటించిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సైతం ఆయనకు గుడ్‌బై కొట్టి మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. ఇందుకు కారణం ఆయనపై ఎవరికీ నమ్మకం లేకపోవడమే. జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావానికి వేదికైన జిల్లా నుంచి మొదట్లో వెంట ఉన్న వారిలో 10 శాతం మంది కూడా ఇప్పుడు కిరణ్‌ను నమ్మడం లేదు. నిన్నమొన్నటి వరకు కిరణ్ వెంట ఉన్న వారంతా తలోదారి వెతుక్కునే పనిలో ఉన్నారు. ఇతర పార్టీల్లో దారులన్నీ మూసుకుపోవడంతో విధిలేక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం కిరణ్ పార్టీ వైపు సానుకూలంగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తొలిసారి ప్రకటించింది రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు. సమైక్యాంధ్ర కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా పార్టీ పెడుతున్నారని హైదరాబాద్ అసెంబ్లీ లాబీల్లో రౌతు మీడియాకు తెలియజేశారు. అప్పుడు సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర గురించి చెప్పిందంతా వాస్తవమనే నమ్మకంతో రౌతు ఆయన వెంట ఉన్నారు. వాస్తవంగా మాజీ సీఎం అజెండా మరేదో ఉందని తెలుసుకున్న తరువాత నుంచి ఆయన నుంచి దూరం జరిగిపోయారు. కాంగ్రెస్‌ను వీడిన సూర్యప్రకాశరావు కిరణ్ పెట్టే పార్టీలోకి రావాలని ఒత్తిళ్లు వచ్చాయి. పలు సందర్భాల్లో తన ఆత్మ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమారేనని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని రౌతు చెప్పారు. అటువంటి ఉండవల్లి.. రాజకీయాలకు దూరమైపోయానని అన్న మాటలను గట్టుమీద పెట్టి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీకి తాత్కాలిక కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రౌతు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడలేదు. మహానేతపై అభిమానంతో... ఉండవల్లి మాట తప్పి కిరణ్ పార్టీ వైపు వెళ్లినా రౌతు మాత్రం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అంచంచల విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అదీ కూడా బుధవారం కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ సభ జరగడానికి 24 గంటల ముందు రౌతు వైఎస్సార్సీపీలో చేరడం గమనార్హం. మహానేత వైఎస్ సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని నమ్ముతున్న జన నాడిని రౌతు గుర్తించబట్టే కిరణ్‌ను కాదని వైఎస్సార్సీపీలో చేరడానికి కారణమైందంటున్నారు. రౌతు హైదరాబాద్‌లో మంగళవారం జగన్ సమక్షాన వైఎస్సార్సీపీలో చేరారు. జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి రౌతునుసాదరంగా ఆహ్వానించారు. రౌతుతో పాటు జిల్లాలోని వైశ్య సామాజికవర్గం నుంచి పేరున్న కొల్లేపల్లి శేషయ్య, మాజీ కార్పొరేటర్ బి.వెంకటేశ్వరరావు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుతో శేషయ్యకు మంచి సాన్నిహిత్యం ఉండేది. జిల్లాలోని తూర్పుకాపు, వైశ్య సామాజిక వర్గీయులు ఇప్పటికే వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉండగా, రౌతు, కొల్లేపల్లి చేరిక పార్టీకి మరింత బలాన్నిచ్చింది. పార్టీలో చేరిన సందర్భంగా వారి వెంట ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, రాజమండ్రి సిటీ, రూరల్ కోఆర్డినేటర్లు బొమ్మన రాజకుమార్, అనంత ఉదయభాస్కర్, ఆకుల వీర్రాజు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమండ్రి నగర యువజన కన్వీనర్ గుర్రం గౌతమ్, యువజన విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు వరదా కిరణ్, యువనేత జక్కంపూడి రాజా, పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, చోడిశెట్టి రాఘవబాబు తదితరులున్నారు. -
వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు
-
వైఎస్ఆర్సీపీలోకి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. వైఎస్ జగన్ కండువా కప్పి రౌతు సూర్యప్రకాశరావును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తానని తెలిపారు. -
బుచ్చయ్యచౌదరిపై మహిళల దాడి
-
బుచ్చయ్యచౌదరిపై మహిళల దాడి
రాజమండ్రి: టీడీపీ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై మహిళలు దాడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. లాటరీ ద్వారా వాంబే గృహాల కేటాయింపు సందర్భంగా ఘర్షణ జరిగింది. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బుచ్చయ్యచౌదరి.. లాటరీ విధానాన్ని అడ్డుకుని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆయనపై దాడి చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అనుచరులు బుచ్చయ్యచౌదరిపై రాళ్లు విసిరినట్టు చెబుతున్నారు. ఘర్షణ వాతావరణంతో రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.