
జగన్ దృష్టికి పోలింగ్ పరిస్థితి : బాబిరెడ్డి
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ పరిస్థితిని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలిసి వివరించామని పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు సబ్బెళ్ల బాబిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం అక్కడి నుంచి ఫోన్‌లో రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, గెలుపు అవకాశాలపై ఓ నివేదిక అందజేశామన్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజక వర్గంలోని అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రాజానగరం నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్న విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డికి వివరించామన్నారు.