సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని టీ పీసీసీ మేనిఫెస్టో కమిటీకి గల్ఫ్ సబ్‌కమిటీ ప్రతిపాదనలు సమర్పించింది. ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయింపు, గల్ఫ్ ఫండ్ నిర్వహణకు గల్ఫ్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహాకు కమిటీ ఈ ప్రతిపాదనలు సమర్పించింది.
అనంతరం విలేకరులతో గల్ఫ్ సబ్‌కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, ప్రవాస సంక్షేమ వేదిక చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు రాజ్‌కుమార్, అనిల్‌తో కలసి వివరాలను వెల్లడించారు. గల్ఫ్‌లో మృతి చెందినవారి కుటుంబాలకు 5 లక్షల పరి హారం, గల్ఫ్ బాధితులకు కార్పొరేషన్ నేరుగా అందుబాటులో ఉండే వెసులుబాటు, ఏజెంట్ల మోసాలకు, అక్కడి యజమానుల కుట్రలకు బలై చిన్నచిన్న కారణాలతో జైలుకెళ్లిన వారికి న్యాయ సహాయం అంశాలపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో అమలు చేయాలని సూచించినట్లు చెప్పారు.
నాలుగున్నరేళ్లలో నయాపైసా ఇవ్వలే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను నిర్లక్ష్యం చేసిందని భీంరెడ్డి ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో గల్ఫ్‌లో 800 మంది చనిపోతే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నయా పైసా సహాయం చేయలేదన్నారు. విదేశాల్లో మృతి చెందిన వారి శవపేటికలను తేవడం కూడా కష్టంగా మారిందని అన్నారు. కాంగ్రెస్‌తోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమం సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికులకు జీవిత, ఆరోగ్య బీమా వర్తింపజేసే విధంగా మేనిఫెస్టో కమిటీకి ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు.
రూ.500 కోట్లతో ‘గల్ఫ్ ఫండ్’ పెట్టాలి
Published Sat, Sep 29 2018 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Comments
Please login to add a commentAdd a comment