‘కేసీఆర్‌ ఎక్కడికైనా రావొచ్చు.. రమ్మనండి’ | TDP Leader Pithani Satyanarayana Comments Over BJP And KCR | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ ఎక్కడికైనా రావొచ్చు.. రమ్మనండి’

Published Thu, Dec 13 2018 2:46 PM | Last Updated on Thu, Dec 13 2018 3:03 PM

TDP Leader Pithani Satyanarayana Comments Over BJP And KCR - Sakshi

సాక్షి, అమరావతి : భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నమ్మారని, అందుకే కాంగ్రెస్‌ వ్యతిరేక భావాలతో పుట్టిన టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుందని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీ సంకని తాము ఎక్కితే తమ సంకని బీజేపీ వాళ్లు ఎక్కారంటూ చమత్కరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ ఎక్కడికైనా రావచ్చు.. ఎవరైనా రావొచ్చు.. రమ్మనండి’  అని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, పోటీ చేయటం సహజమని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టే అక్కడకు వెళ్లి పోటీ చేసినట్లు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీతో ఉంటామని వెల్లడించారు. ఏపీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీ కలవటం వల్లే తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయారనడం కరెక్ట్‌ కాదని, ఓడిపోయాక ఏదైనా మాడ్లాడతారని ఆయన మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement