టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు | TRS MLA Rasamayi Balakishan Interesting Comments | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు

Published Thu, Sep 5 2019 8:59 PM | Last Updated on Thu, Sep 5 2019 10:17 PM

TRS MLA Rasamayi Balakishan Interesting Comments - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారగా.. తాజాగా బాలకిషన్‌ చేసిన వాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ.. మంత్రి ఈటల రాజేందర్ కు, తనకు నిజాలు మాట్లాడటమే వచ్చన్నారు. తాము కడుపులో ఏమీ దాచుకోమని.. ఉద్యమంలో కొట్లాడినోళ్లమని.. తమకు అబద్దాలు రావంటూ రసమయి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  రసమయి మాట్లాడుతుండగా.. మధ్యలో కల్పించుకున్న ఈటల నవ్వుతూ ‘జాగ్రత్తగా మాట్లాడు’ అంటూ సూచించారు. ‘ఏమీ కాదన్నా’ అనుకుంటూనే రసమయి బాలకిషన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

(చదవండి : ‘నా మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు’)

ఆ తర్వాత మాట్లాడిన ఈటల.. రసమయికి కాస్త స్వేచ్ఛ ఎక్కువ అని, ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన ఓ సభలో మంత్రి ఈటల మాట్లాడుతూ...మంత్రి పదవి తనకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదని, మంత్రి పదవి కోసం కులం పేరుతో కొట్లాడలేదు.. తెలంగాణ కోసం చేసిన ఉద్యమమే తనను మంత్రిని చేసింందని వాఖ్యానించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement