సాక్షి, ముంబై : అందరూ ఊహించినట్టుగానే బాలీవుడ్‌నటి ఊర్మిళ మటోండ‍్కర్ (45) లోక్‌సభ ఎన్నికల బరిలోనిలిచారు. ముంబై నార్త్ లోక్‌సభ అభ్యర్థిగా ఊర్మిళను బరిలో నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈసీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్ అధికారిక ప్రకటన జారీ చేశారు. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పార్టీ అభ్యర్థిగా ఊర్మిళ అభ్యర్థిత్వాన్ని ఆమోదించిందని వెల్లడించారు. తద్వారా కాంగ్రెస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానంలో మరోసారి బాలీవుడ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ బుధవారం పార్టీలో చేరిన ఊర్మిళ అపుడే మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని వ్యక్తిగతంగా మంచి వ్యక్తేనని..కానీ ప్రధానిగా ఆయన అనుసరిస్తున్న విధానాలే మంచివి కావని అన్నారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం మాట్లాడాలో నిర్ణయించుకునే హక్కును మోదీ కాలరాశారని విమర్శించిన సంగతి తెలిసిందే.
కాగా బాల నటిగా మరాఠీ చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఊర్మిళ మటోండ్కర్ హీరోయిన్‌గా పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. పార్టీలో చేరిన రెండు రోజుల్లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక విశేషమైతే బీజేపీకి కంచుకోటలాంటి ముంబై నార్త్ నియోజవర్గంలో బరిలోకి దిగడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment