వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా కుటుంబీకులు! | Vanthala Rajeshwari Facing Bad Situation By Her Relatives | Sakshi
Sakshi News home page

వంతల రాజేశ్వరిని ఓడించండి, అత్తింటివారి అభ్యర్థన

Published Tue, Apr 9 2019 5:34 PM | Last Updated on Tue, Apr 9 2019 5:46 PM

Vanthala Rajeshwari Facing Bad Situation By Her Relatives - Sakshi

సాక్షి​, తూర్పు గోదావరి : రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా ఆమె కుటుంబసభ్యులే ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా రాజేశ్వరిని ఓడించాలంటూ అత్తింటి తరఫు కుటుంబసభ్యులు ప్రాధేయపడుతున్నారు.  ఈ సందర్భంగా వంతల రాజేశ్వరిపై అత్తింటివారు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వరిని కిషోర్ అనే గిరిజనేతరుడు తన చెప్పుచేతల్లో ఉంచుకుంటూ తమ కుటుంబానికి దూరం చేశాడంటూ విమర్శలు గుప్పించారు.  ఆమెని మభ్యపెట్టి భర్తను దూరం చేయడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో ఓడించి తమ కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని విజ్ఞప్తి  చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ వంతల రాజేశ్వరి అత్తింటివారు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement