![YSRCP MLA Amjad Basha Fires On TDP Over No Confidence Motion - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/22/Amjad-Basha.jpg.webp?itok=FDpkvoKh)
సాక్షి, వైఎస్సార్: హోదాపై బాబు మోసం, ఎన్డీఏ తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24న (మంగళవారం) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అంజద్ బాషా కోరారు. పార్టీ నేత సురేష్ బాబుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ది జరుగుతదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైఎస్ జగన్ పోరాటాల వల్లే హోదా అంశం సజీవంగా ఉందని అభిప్రాయపడ్డారు. నాలుగేళ్లుగా హోదా కోసం పోరాడుతున్నది కేవలం వైఎస్‌ఆర్‌సీపీ మాత్రమేనని స్పష్టంచేశారు. పార్లమెంట్‌లో టీడీపీ ఆడిన డ్రామాలన్నీ ప్రజలు గమనించారని వివరించారు. నిన్నటి వరకు ప్యాకేజీ అన్న బాబు నేడు హోదా అంటూ బోర్డు తిప్పేశారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని అంజద్ బాషా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment