
సాక్షి, సూళ్లూరుపేట: మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా సోమవారం అధికారపార్టీ నాయకులు పట్టణంలో హడావుడిగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. రూ.40 లక్షలతో అన్న క్యాంటీన్, రూ.8 లక్షలతో అంగన్‌వాడీ భవనాన్ని, రూ.30 లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని, నుడా పార్కును ప్రారంభించారు. నుడా పార్కు నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ప్రారంభం చేయడం విమర్శలకు దారితీసింది. రూ.142 కోట్లతో ఏఐఐబీ నిధులతో తాగునీటి పథకానికి, రూ. 34.65 కోట్లతో రోడ్లు, మురుగు నీటికాలువ నిర్మాణానికి, మటన్‌మార్కెట్, కంపోస్ట్ యార్డ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలకు మంత్రి నారాయణ వస్తున్నారని ప్రచారం చేశారు. సోమవారం సాయంత్రం మంత్రి రావడం లేదని తెలుగు తమ్ముళ్లు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment