
ఫ్లోరిడా: పారాచూట్ సరిగా పని చేయకపోవడంతో.. వందల అడుగుల ఎత్తు నుంచి ఇద్దరు స్కైడైవర్స్ నేల మీద పడి పోయారు. ఈ భయానక దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన టైటస్విల్లే, ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్కైడైవర్లు ఆకాశంలో ఎగరుతున్నారు. అయితే వారి పారాచూట్ సరిగా పని చేయకపోవడంతో స్కైడైవర్లు ఆకాశంలో ఒకరిని ఒకరు ఢీ కొట్టారు.
కింద నుంచి చూస్తున్న ప్రజలు స్కైడైవర్లు జోక్ చేస్తున్నారని అనుకున్నారు. కానీ వారు నియంత్రణ కోల్పోయి నేరుగా నేల మీదకు రాసాగారు. అప్పుడు అక్కడ ఉన్న జనాలు చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోయారు. వారు నేరుగా వెళ్లి ఓ ఇంటి ముందు ఉన్న పెరట్లో పడ్డారు. వీరు కింద పడటం గమనించిన ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ స్కై డైవర్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment