
సూరత్ : ఈ వాళ, రేపు వాట్సాప్ గురించి తెలయని వారు ఉండరు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్ తప్పనసరి. ఈ క్రమంలో తమ పెళ్లి కార్డును వాట్సాప్ రూపంలో డిజైన్ చేయించారో దంపతులు. ప్రస్తుతం వీరి పెళ్లి కార్డు తెగ వైరల్ అవుతోంది. వివరాలు.. సురత్‌కు చెందిన చింతన్ అనే వ్యక్తి వెబ్ డిజైనర్. తన పెళ్లి కార్డును వెరైటిగా డిజైన్ చేయించాలని భావించాడు. ఈ క్రమంలో వాట్సాప్ రూపంలో తన పెళ్లి కార్డును డిజైన్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నాడు.
స్వతహగా వెబ్ డిజైనర్ కావడంతో వాట్సాప్ రూపంలో తన పెళ్లి కార్డును డిజైన్ చేశాడు. గుజరాతీ, ఇంగ్లీష్ భాషల్లో నాలుగు పేజీల్లో కార్డ్‌ను ప్రింట్ చేశారు. స్టేటస్ దగ్గర తాను, తన కాబోయే భార్య అర్జూ, కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసి మా పెళ్లికి రాకపోతే మా వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్ చేస్తామని ప్రింట్ చేశారు. వాట్సాప్ లోగో మీద గణపతి బొమ్మను ముద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment