సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారాలోకేశ్‌పై మెగాబ్రదర్ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మై ఛానెల్ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్ చానెల్ ప్రారంభిన ఆయన.. పొలిటికల్ ఫీచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో పొలిటికల్ అభిప్రాయాలను మాత్రమే పంచుకుంటానన్న మెగా బ్రదర్.. ఇది కేవలం నవ్వుకోవడానికి మాత్రమేనని, పెద్దగా సిరీయస్‌గా స్పందించాల్సి అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ చానెల్‌లో ఎప్పుడు ఎక్కడా చూడనవి, ఒకవేళ చూసినా నిశబ్ధంగా మరిచిపోయేలా చేసినవి చూపిస్తానని, దీంతో ఎవరికి సంబంధం లేదన్నారు. ఇందులో భాగంగా ఆయన నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గతంలో లోకేష్ ఓ బహిరంగ సభలో.. ‘అవినీతి, బంధుప్రీతి, మతపిచ్చి,కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదన్న ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే’ అని చేసిన వ్యాఖ్యలను జోడిస్తూ సెటైర్లేశారు. ‘పిల్లలు దేవుళ్లు చల్లని వారే. కళ్ల కపటం లేని కరుణమాయులే.’ అని చిన్నప్పుడు చదువుకున్నానని, అలానే లోకేష్‌బాబు వాస్తవాలను ఒప్పుకున్నారని చెప్పారు. ‘థ్యాంక్యూ లోకేష్ మీ పార్టీ గురించి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత నిజాయితీగా మాట్లాడే రాజకీయనాయకుడే లేడు. లోకేష్‌కు ఒక్క ఓ వేసుకుందాం’ అని నాగబాబు అభిమానులకు పిలుపునిచ్చారు. ఇక మొన్నటి వరకు నటుడు బాలకృష్ణపై సెటైర్లు వేసిన నాగబాబు.. ఇప్పుడు ఆయన అల్లుడు నారాలోకేశ్‌ను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment