పది మంది సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ మధ్య జరిగిన నార్వే ఓపెన్ బ్లిట్జ్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్
స్టావాంజర్ (నార్వే): పది మంది సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ మధ్య జరిగిన నార్వే ఓపెన్ బ్లిట్జ్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఏడో స్థానంలో నిలిచాడు. తొమ్మిది రౌండ్ల తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లు సాధించాడు. ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్, రెండింటిలో ఓడి, మరో గేమ్‌లో గెలిచాడు.
మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 7.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఇదే టోర్నీలో మంగళవారం జరిగిన క్లాసికల్ విభాగం తొలి గేమ్‌లో మాక్సిమ్ లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో ఆనంద్ 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.