
సెంచూరియన్ టెస్టులో పరాజయం తర్వాతి రోజు భారత క్రికెటర్లు అడవిలో సఫారీకి వెళ్లి సేద తీరారు. క్రూగర్స్ నేషనల్ పార్క్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సింహం పిల్లలతో ఫొటో దిగి దానికి వ్యాఖ్య కూడా జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
‘జీవితం మనల్ని వెనక్కి లాగినప్పుడు ఎప్పుడూ బాధ పడవద్దు. ఎందుకంటే సింహం కూడా అమాంతం దూకి దాడి చేసే ముందు ఒకడుగు వెనక్కి వేస్తుంది’ అంటూ తాము చివరి టెస్టులో కోలుకుంటామన్నట్లు పరోక్షంగా చెప్పాడు!