
లండన్: అమెరికా టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఓపెన్ శకంలో (1968 నుంచి) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన అతి పిన్న వయస్కురాలిగా (15 ఏళ్ల 122 రోజులు) ఆమె చరిత్ర సృష్టించింది. క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో కోరి గౌఫ్ 6–1, 6–1తో 19వ సీడ్ గ్రీట్ మినెన్ (బెల్జియం)పై విజయం సాధించింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్‌తో కోరి గౌఫ్ తలపడుతుంది. 2009 వింబుల్డన్‌లో బ్రిటన్‌కు చెందిన లారా రాబ్సన్ 15 ఏళ్ల వయసులో మెయిన్ ‘డ్రా’లో ఆడింది. అయితే లారా రాబ్సన్‌కు టోర్నీ నిర్వాహకులు నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు వైల్డ్ కార్డు ఇచ్చారు.