
ముంబై: టీమిండియా నయా సంచలన ఆటగాడు రిషభ్ పంత్‌కు సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అదేవిధంగా సారథి విరాట్ కోహ్లి కూడా జస్ప్రిత్ బుమ్రాపై మండిపడ్డాడు. ఇదేంటి నిన్నటి వరకు ప్రత్యర్థి ఆటగాళ్లకు సవాల్ విసిరిన టీమిండియా ఆటగాళ్లు.. ఇప్పుడు సొంత జట్టు ఆటగాళ్లపై ఎందుకు విరుచుకుపడుతున్నారని అనుకుంటున్నారా?.. అంతా ఐపీఎల్ మహిమ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పోట్టి క్రికెట్ సమరం ఐపీఎల్ 2019కు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 23 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దీంతో బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ టీమిండియా క్రికెటర్లతో ఆసక్తికరమైన ప్రోమోలను రూపొందిస్తోంది
ఇక ఇప్పటికే పంత్, బుమ్రాలు ధోని, కోహ్లిలపై చాలెంజ్ విసిరిన ప్రోమోలు విడుదల చేసిన స్టార్ తాజాగా వాటిపై స్పందనగా మరో రెండు ప్రోమోలను రిలీజ్ చేసింది. ప్రోమోలో భాగంగా కెప్టెన్ అని కూడా చూడకుండా నాకే సవాల్ విసరుతావా అంటూ జస్ప్రిత్ బుమ్రాపై విరాట్ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేయడం.. గురువు అంటూనే నా సంగతే చూస్తా అంటావా అంటూ ధోని పంత్‌కు స్వీట్ వార్నింగ్ ఇస్తున్న ఈ ప్రోమోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు, కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, పంత్ ఢిల్లీ జట్టుకు, బుమ్రా ముంబై ఇండియన్ జట్ల తరుపున్న ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment