మాడ్రిడ్ (స్పెయిన్): ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన గారెత్ బేల్... రియల్ మాడ్రిడ్ తరఫున అరంగేట్రం చేశాడు. స్పెయిన్ లీగ్ ‘లా లీగా’లో భాగంగా శనివారం విల్లార్ రియల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగి ఓ గోల్ సాధించాడు.
అయితే రియల్ మాడ్రిడ్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో ‘డ్రా’ అయ్యింది. ఆట 50వ నిమిషంలో డాని కార్వాజల్ ఇచ్చిన క్రాస్‌ను అద్భుతంగా గోల్‌పోస్ట్‌లోకి పంపిన బేల్ ఆ తర్వాత మైదానంలో నుంచి బయటకు వచ్చాడు. అతని స్థానంలో అంజెల్ డి మారియో ఆడాడు. ఈ నెలారంభంలో విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్ రూ. 878 కోట్లు వెచ్చించి బేల్‌ను టోటెన్‌హామ్ హాట్‌స్పర్ క్లబ్ నుంచి కొనుగోలు చేసింది.
బేల్ గోల్ చేసినా...
Published Mon, Sep 16 2013 1:23 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement