భజ్జీ పెళ్లికి భారీ సన్నాహాలు | Harbhajan Singh-Geeta Basra wedding | Sakshi
Sakshi News home page

భజ్జీ పెళ్లికి భారీ సన్నాహాలు

Published Wed, Oct 28 2015 11:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

భజ్జీ పెళ్లికి భారీ సన్నాహాలు

భజ్జీ పెళ్లికి భారీ సన్నాహాలు

న్యూఢిల్లీ: ఐదురోజులపాటు అట్టహాసంగా జరుగనున్న క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా పెళ్లికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం వీరి పెళ్లి జరుగనుంది. దీంతోపాటు మెహిందీ, సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం వధూవరులకు ప్రముఖ డిజైనర్ అర్చన కొచ్చర్ వస్త్రాలను రూపొందిస్తున్నారు. పెళ్లిరోజున భజ్జీ, గీత వేసుకునే దుస్తులను అత్యంత సంప్రదాయ శైలితో సరికొత్తగా రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు.

'గీత బాగా సంప్రదాయబద్ధంగా డిజైన్ను కోరుకుంటున్నారు. ఆమె కోసం భారతీయ వర్క్తో కూడిన లెహెంగా, దుపట్టా, బ్లౌజ్ సిద్ధం చేస్తున్నాం. భజ్జీ కూడా సంప్రదాయ డిజైన్కు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లిరోజున ఆయన భారతీయతో ఉట్టిపడే చుడిదార్ ధరించనున్నారు. మెహిందీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా వివిధ వేడుకలకు వధూవరులు మెచ్చేరీతిలో డిజైన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం' అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఐదురోజుల ఈ పెళ్లి వేడుకలో భాగంగా నవంబర్ 1న జరుగనున్న రిసెప్షన్కు క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement