ఓవరాల్‌ చాంప్‌ హైదరాబాద్‌ | Hyderabad wrestlers win Telangana Junior Championship | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 4 2018 10:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

 Hyderabad wrestlers win Telangana Junior Championship - Sakshi

ట్రోఫీతో హైదరాబాద్‌ జిల్లా జట్టు 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర జూనియర్‌ అంతర్‌ జిల్లా రెజ్లింగ్‌ టోర్నమెంట్‌ లో హైదరాబాద్‌ జిల్లా జట్టు ఓవరాల్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించింది. 79 పాయింట్లతో హైదరాబాద్‌ జట్టు మొదటి స్థానంలో నిలవగా... 51 పాయింట్లతో రంగారెడ్డి జిల్లా జట్టు రెండో స్థానం దక్కించుకుంది.  

బాలికల 50 కేజీల విభాగం ఫైనల్లో సీహెచ్‌.మౌనిక (వరంగల్‌)పై ఎన్‌.శిరీష యాదవ్‌ (హైదరాబాద్‌) గెలుపొందింది. 53 కేజీల విభాగంలో వైష్ణవి యాదవ్‌ (హైదరాబాద్‌)పై ఎన్‌.మౌనిక (కరీంనగర్‌) విజయం సాధించింది. 55 కేజీల విభాగంలో ఎం.నవ్య (మెదక్‌)పై వి.నయని (రంగారెడ్డి) గెలిచింది. 59 కేజీల విభాగంలో వీణ (నిజామాబాద్‌)పై టి.సంధ్యారాణి (మెదక్‌); 62 కేజీల విభాగంలో పి.నిహారిక (కరీంనగర్‌)పై రోహిణి (రంగారెడ్డి) గెలుపొందారు. 

బాలుర 55 కేజీల విభాగంలో కె.మధుకర్‌ (వరంగల్‌)పై తుకారామ్‌ సింగ్‌ (హైదరాబాద్‌); 60 కేజీల విభాగంలో ఎం.శ్రీకాంత్‌ (నిజామాబాద్‌)పై సాయి కుమార్‌ యాదవ్‌ (అదిలాబాద్‌); 63 కేజీల విభాగంలో మోనూ యాదవ్‌ (రంగారెడ్డి)పై అబూబకర్‌ బిన్‌ అలీ (హైదరాబాద్‌); 67 కేజీల విభాగంలో జి.నరేందర్‌ (రంగారెడ్డి)పై అబ్రార్‌ (హైదరాబాద్‌); 72 కేజీ ల విభాగంలో నవాజ్‌ అహ్మద్‌ (హైదరాబాద్‌)పై కె.శివ (మహబూబ్‌నగర్‌); 77 కేజీల విభాగంలో ఎం.బాలాజీ (వరంగల్‌)పై సి.నితిన్‌ (హైదరాబాద్‌); 82 కేజీల విభాగంలో కళ్యాణ్‌రామ్‌ (వరంగల్‌)పై కె.యశ్విన్‌ సింగ్‌ (హైదరాబాద్‌); 87 కేజీల విభాగంలో వివేక్‌ (వరంగల్‌)పై ధీరన్‌ యాదవ్‌ (హైదరాబాద్‌) గెలుపొందారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement