పరారీలో ఉన్నా.. వస్తూనే ఉంటా: మాల్యా | I intend to attend all games to cheer team India, tweets vijay mallya | Sakshi
Sakshi News home page

పరారీలో ఉన్నా.. వస్తూనే ఉంటా: మాల్యా

Published Tue, Jun 6 2017 8:11 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

పరారీలో ఉన్నా.. వస్తూనే ఉంటా: మాల్యా

పరారీలో ఉన్నా.. వస్తూనే ఉంటా: మాల్యా

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హాజరు కావడం జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్‌ అయ్యింది. దాదాపు అన్ని చానళ్లు దీన్ని విపరీతంగా ప్రచారం చేశాయి. దానిపై విజయ్ మాల్యా కూడా స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌కు తాను రావడంపై మీడియా కవరేజి సెన్సేషనల్‌గా ఉందని, అయితే తాను మొత్తం అన్ని మ్యాచ్‌లకు వచ్చి భారత జట్టును అలరిస్తానని చెప్పాడు.

ఇక మొట్టమొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టును చావుదెబ్బ కొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మాల్యా ప్రశంసల్లో ముంచెత్తాడు. వరల్డ్ క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ కెప్టెన్, వరల్డ్ క్లాస్ జెంటిల్మన్ అంటూ పొగిడేశాడు. బ్రేవో విరాట్ అంటూ అభినందించాడు. స్వదేశంలో వివిధ బ్యాంకులకు దాదాపు రూ. 3వేల కోట్ల వరకు బాకీపడి, వాటిని తీర్చాలని గట్టిగా ఒత్తిడి వస్తుండగానే ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో రాత్రికి రాత్రే చెప్పాపెట్టకుండా విజయ్ మాల్యా లండన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు వేదికలపై ఆయన లండన్‌లో దర్శనమిస్తూనే ఉన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement