
చైనాకు భారత్ షాక్
ఆసియా చాలెంజ్ బాస్కెట్‌బాల్‌లో ఆశలు సజీవం
టెహ్రాన్: ఫిబా ఆసియా చాలెంజ్ బాస్కెట్‌బాల్‌లో భారత జట్టు తమ క్వార్టర్‌ఫైనల్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. తమ గ్రూప్ ‘ఇ’ రెండో రౌండ్‌లో పటిష్ట చైనాకు షాక్‌నిస్తూ 70-64 తేడాతో నెగ్గింది. భారత్‌కు అమ్రిత్ పాల్ సింగ్ ఆల్‌రౌండ్ షోతో 23 పారుుంట్లు అందించాడు. ఈ గ్రూప్‌లో టాపర్‌గా ఉన్న చైనాకు ఇది తొలి ఓటమి. మరోవైపు భారత్‌కు ఇది రెండో విజయం. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్.. క్వార్టర్స్‌లో చోటు దక్కాలంటే టాప్-4లో నిలవాలి. నేడు (బుధవారం) జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో కజకిస్తాన్‌తో తలపడుతుంది.