సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ కప్‌కు ముందు, ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేకు కోహ్లి సేన సిద్ధమైంది. ఆస్ట్రేలియా గడ్డపై సంచలనాలు నమోదు చేసిన టీమిండియా.. స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక టీ20ల సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నీకి ముందు ఆడనున్న ఆఖరి వన్డే సిరీస్ కావడంతో కోహ్లి సేన ప్రస్తుతం విజయంపై దృష్టిసారించింది.
అదే విధంగా టి20 సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న జోరులో ఉన్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆసీస్‌కు మంచి రికార్డు ఉండటం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఈ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 వన్డేలు జరగ్గా రెండూ ఆసీస్ గెలిచింది. 2007లో 47 పరుగులతో, 2009లో 3 పరుగులతో నెగ్గింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. చహల్ స్థానంలో జడేజాను జట్టులోకి తీసుకున్నారు.
తుది జట్ల వివరాలు
భారత్ : కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ధోని, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమీ.
ఆస్ట్రేలియా జట్టు
ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, టర్నర్, కారే, నాథన్ కౌల్టర్ నైల్, ప్యాట్ కమ్మిన్స్, ఆడం జంపా, జాసన్ బెహ్రన్‌డార్ఫ్
చేజింగ్‌లో మాకు మంచి రికార్డు ఉంది
‘ముందు బౌలింగ్ చేస్తున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయినా చేజింగ్‌లో మాకు మంచి రికార్డు ఉంది. ఆసీస్, న్యూజిలాండ్ ఫలితాలను పునరావృతం చేయాలని భావిస్తున్నాం. చహల్‌కు విశ్రాంతినిచ్చి జడేజాను తీసుకున్నాం. న్యూజిలాండ్‌లో ఆడిన టాప్ ఆర్డర్ ఇక్కడ కూడా రాణిస్తుంది’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment