
ముంబై: నాలుగో వన్డేలో బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసిన అనంతరం అతిగా సంబరాలు చేసుకున్న భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఐసీసీ హెచ్చరికకు గురయ్యాడు. నిబంధనల ప్రకారం లెవల్–1 తప్పిదానికి పాల్పడినట్లు గుర్తించిన ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్... ఖలీల్‌కు ఒక డీమెరిట్ పాయింట్ శిక్షగా విధించారు.
ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మార్లోన్ శామ్యూల్స్ స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో బౌలర్ చర్యలు తీవ్రంగా, బ్యాట్స్‌మన్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఐసీసీ అభిప్రాయపడింది. ఈ మ్యాచ్‌లో ఖలీల్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.