నాగ్‌పూర్: శ్రీలంకతో జరగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 259 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో ఐదో ద్విశతకాన్ని కోహ్లీ (267 బంతుల్లో 213 పరుగులు: 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. పెరీరా వేసిన ఇన్నింగ్స్ 168వ ఓవర్లో 4వ బంతిని ఫోర్ కొట్టిన కోహ్లీ, ఆ మరుసటి బంతిని లాంగ్ ఆన్ దిశగా ఆడగా కరుణరత్నే క్యాచ్ పట్టడంతో ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. దీంతో 173 పరుగుల భారీ శతక భాగస్వామ్యానికి తెరపడింది.
ఆపై క్రీజులోకొచ్చిన అశ్విన్ (5) త్వరగా ఔటయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ (145 బంతుల్లో 85: 7 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (1) క్రీజులో ఉన్నారు. భారత్ 174 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 594 పరుగులు చేసింది. లంక తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment