ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై | MIvSRH Mumbai Indians win toss and opt to bowl vs Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

May 8 2016 3:55 PM | Updated on Sep 3 2017 11:41 PM

ఐపీఎల్ 9లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

విశాఖపట్నం: ఐపీఎల్ 9లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 10 పాయింట్లతో పట్టికలో అమీతుమీగా ఉన్నాయి.  

ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గతంలో హైదరాబాద్ జట్టు ఇక్కడ కొన్ని మ్యాచ్‌లను ఆడినా ఈ సీజన్‌లో అన్ని హోమ్ మ్యాచ్‌లను భాగ్యనగరంలోనే ఆడుతోంది. అయితే మహారాష్ట్ర మ్యాచ్‌లను తరలించాల్సి రావడం విశాఖ అభిమానులకు వరంగా మారింది. పుణే, ముంబై రెండు జట్లూ తమ హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement