సెమీ-ఫైనల్ మ్యాచ్‌లోని ఓ దృశ్యం
ఇస్లామాబాద్ : అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చిత్తుగా 69 పరుగులకే అలౌట్ చేసి 203 పరుగుల తేడాతో భారత్ ఎదురులేని విజయాన్ని సాధించింది. అయితే ఈ ఓటమిపై పాక్‌లో జట్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. టీమిండియాను పొగుడుతూ జట్టు మేనేజర్ నాదిమ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
‘‘273 పరుగుల లక్ష్య చేధన పెద్ద విషయం ఏం కాదు. పైగా పాక్ జట్టు చాలా బలంగా ఉంది. ఈ క్రమంలో ఇంత తక్కువ స్కోర్‌కు అవుట్ కావటం నమ్మశక్యం కావటం లేదు. ఆట జరిగిన తీరును గమనిస్తే పాక్ ప్లేయర్లపై ‘మ్యాజిక్ స్పెల్’ బాగా పని చేసిందనిపిస్తోంది. ఆ ఓవర్లలో భారత బౌలర్లు వేసిన బంతులు టర్న్ కావటంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఒత్తికి గురై వికెట్లను జేరాచ్చుకున్నారు’’అని వ్యాఖ్యానించాడు. దీంతోపాటు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై నాదిమ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.
అయితే నాదిమ్ ప్రకటనపై పీసీబీ అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన ఆయన ఈసారి ఆటగాళ్ల వైఫల్యాన్ని ఎండగట్టారు. పాక్ చరిత్రలో ఇంత చెత్త అండర్ 19 టీమ్‌ను చూడలేదని.. వారంతా చాలా అంశాల్లో వెనకబడి ఉన్నారని వ్యాఖ్యానించి ఈసారి ఆటగాళ్ల నుంచి ఆయన వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment