శ్రీలంకతో రెండో టెస్టు
దుబాయ్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఓటమి నుంచి గట్టెక్కెందుకు పాకిస్తాన్ పోరాడుతోంది. 317 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
ఒక దశలో 52 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌ను అసద్ షఫీక్ (86 బ్యాటింగ్; 8 ఫోర్లు), సర్ఫరాజ్ అహ్మద్ (57 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. పెరిరా 3, గమేజ్, ఫెర్నాండో చెరో వికెట్ తీశారు. అంతకుముందు 34/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 96 పరుగులకే ఆలౌటైంది.
పాకిస్తాన్ పోరాటం
Published Tue, Oct 10 2017 1:21 AM | Last Updated on Tue, Oct 10 2017 1:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment