'నన్ను నవాజ్ షరీఫ్ కొనసాగమన్నారు'
కరాచీ: తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా తిరిగి కొనసాగడానికి ప్రధాని నవాజ్ షరీఫ్ కారణమని షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఇటీవల పాక్ క్రికెట్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలని నిర్ణయం తీసుకున్నా, నవాజ్ షరీఫ్ కారణంగా తిరిగా ఆ పదవిలో కొనసాగుతున్నానని షహర్యార్ అన్నారు.
' కొన్ని రోజుల క్రితం లండన్లో ప్రధాని షరీఫ్ను కలిసా. పాక్ క్రికెట్ బోర్డుకు సంబంధించి అనేక విషయాలు చర్చించాం. దానిలో భాగంగానే వచ్చే ఏడాది ఆగస్టు వరకు పాక్ క్రికెట్ చైర్మన్ గా నన్నే కొనసాగమన్నారు. అందుచేత అంగీకరించక తప్పలేదు' అని షహర్యార్ అన్నారు. ఇదిలా ఉండగా, పాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజీమ్ సేథీతో తనకు చిరకాల బంధం ఉందన్నారు. తనకు నజీమ్ సేథీ అత్యంత సన్నిహితుడని ఈ సందర్బంగా షహర్యార్ తెలిపారు. తామిద్దరం సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. అయితే చైర్మన్గా తుది నిర్ణయం మాత్రం తనదేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.