
ఆ ఓవరే మాకు అత్యంత కీలకం!
ఐపీఎల్-8లో భాగంగా గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కెవిన్ పొలార్డ్ వేసిన చివరి ఓవరే తమకు అత్యంత కీలకంగా మారిందని సహచర ఆటగాడు హార్థిక్ పాండ్య స్పష్టం చేశాడు.
ముంబై: ఐపీఎల్-8లో భాగంగా గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆటగాడు కెవిన్ పొలార్డ్ వేసిన చివరి ఓవరే తమకు అత్యంత కీలకంగా మారిందని సహచర ఆటగాడు హార్థిక్ పాండ్య స్పష్టం చేశాడు. తాను చేసిన పరుగుల కంటే పొలార్డ్ వేసిన ఆ ఓవర్ తమ ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టిందన్నాడు. చివరి ఓవర్లో కోల్ కతా 12 పరుగులు చేయాల్సిన సమయంలో పొలార్డ్ అత్యంత తెలివిగా బౌలింగ్ చేశాడని పాండ్య తెలిపాడు. దీంతోనే ముంబై గెలిచిందని పొలార్డ్ పై ప్రశంసలు కురిపించాడు.
పొలార్డ్ వేసిన చివరి ఓవర్ లో పఠాన్‌ను తొలి బంతికే అవుట్ చేయడంతో పాటు చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో ఐదు పరుగులతో ముంబై గెలిచింది. పీయూష్ చావ్లా చివర్లో బంతులను వృథా చేసి కోల్‌కతా ఓటమికి కారణమయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసి కష్టాల్లో పడ్డ ముంబైను హార్దిక్ పాండ్య తన విధ్వంసకర ఆటతో రక్షించాడు. కేవలం 31 బంతుల్లో 8 ఫోర్లు; 2 సిక్సర్లు సాయంతో 61 పరుగులతో నాటౌట్ నిలిచాడు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 171 పరుగులు చేసింది.