
ప్రత్యూష గేమ్ డ్రా
పుణే: ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష తొలి ‘డ్రా' నమోదు చేసింది.
పుణే: ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష తొలి ‘డ్రా' నమోదు చేసింది. తొలి రెండు రౌండ్లలో విజయాలు సాధించిన ప్రత్యూష... థి మాయ్ హంగ్ ఎన్గుయెన్ (వియత్నాం)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను 34 ఎత్తుల్లో ‘డ్రా'గా ముగించింది. మూడో రౌండ్ తర్వాత ప్రత్యూష రెండున్నర పాయింట్లతో మరో 14 మందితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో ఉంది.