
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో 11సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్‌కు చుక్కెదురైంది. మొనాకోలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) 6–4, 6–2తో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్‌ను ఓడించాడు.ఈ గెలుపుతో క్లే కోర్టులపై నాదల్‌ను మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఓడించిన నాలుగో ప్లేయర్‌గా ఫాగ్‌నిని గుర్తింపు పొందాడు. గతంలో జొకోవిచ్ (సెర్బియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), గాస్టన్ గాడియో (అర్జెంటీనా) మాత్రమే ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment