![నాదల్, సెరీనా ముందంజ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/1/71377583446_625x300.jpg.webp?itok=EmyWqkJm)
నాదల్, సెరీనా ముందంజ
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్స్ రఫెల్ నాదల్, సెరీనా విలియమ్స్ శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్(స్పెయిన్) తన తొలి మ్యాచ్లో అమెరికాకు చెందిన ర్యాన్ హారిసన్ను వరుస సెట్లలో ఓడించాడు. 6-4, 6-2, 6-2తో ఓడించి ముందజ వేశాడు. రోజర్ ఫెడరర్(స్విట్జర్లాండ్), గ్రెగా జెమిల్జా(స్లొవేకియా) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు.
మరోవైపు మహిళల సింగిల్స్లో డిపెండింగ్ చాంపియన్ సెరీనా విలియమ్స్ సునాయాసంగా ముందడుగు వేసింది. నాలుగుసార్లు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన సెరీనా తొలి మ్యాచ్లో ఇటలీ వెటరన్ క్రీడాకారిణి ఫ్రాన్సిస్కా సచియోనెను గంట వ్యవధిలోను కంగుతినిపించింది. 6-0, 6-1తో చిత్తు చేసి సెకండ్ రౌండ్లోకి దూసుకెళ్లింది.