న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేతనం చెల్లించింది. జూలైలో కోచ్‌గా నియమితులైన శాస్త్రి మూడు నెలలకు గానూ రూ. 1.20 కోట్లను భత్యంగా అందుకున్నారు. జూలై 18 నుంచి అక్టోబర్ 18 మధ్య కాలానికి ఆయనకు ఈ మొత్తాన్ని చెల్లించినట్లు బీసీసీఐ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
విదేశాల్లో ఆడిన టోర్నీల ద్వారా లభించిన ఆదాయంలో మాజీ కెప్టెన్ ధోనికి అతని వాటాగా రూ. 57 లక్షలు చెల్లించింది. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఖాతాలో రంజీ ట్రోఫీ నిర్వహించినందుకు గానూ రూ. 69 లక్షలు, విజయ్ హజారే ట్రోఫీ నిర్వహణకు రూ. 56 లక్షలను జమ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment