యువరాజ్ సింగ్(ఫైల్‌ఫొటో)
ముంబై: 1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన 28 ఏళ్లకు మళ్లీ ఆ ట్రోఫీని ముద్దాడింది టీమిండియా. దాదాపు మూడు దశాబ్దాల పాటు నిరీక్షణ తర్వాత ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌ను అందుకుంది. సరిగ్గా నిన్నటికి(ఏప్రిల్2) భారత్ వన్డే వరల్డ్‌కప్‌ను అందుకుని తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్ పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. లంకేయులు నిర్దేశించిన 275 పరుగుల టార్గెట్ ఛేదనలో భాగంగా సచిన్ టెండూల్కర్(18), వీరేంద్ర సెహ్వాగ్(0)లు నిరాశపరిచినా, గౌతం గంభీర్(97), ఎంఎస్ ధోని(91 నాటౌట్)లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషిస్తే, విరాట్ కోహ్లి(35), యువరాజ్(21 నాటౌట్)లు తమ వంతు పాత్ర పోషించారు. (ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా?)
కాగా, ఆ మెగా కప్‌ను కీర్తించుకునే క్రమంలో ప్రతీ ఒక్కరూ ధోని కొట్టిన ముగింపు సిక్సర్‌నే హైలైట్ చేస్తున్నారు. ఇది ఆ మ్యాచ్ తుది జట్టులో ఉన్న చాలా మందికి అసహనం కల్గిస్తుంది. దీనిపై ఇప్పటికే గౌతం గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే టీమిండియా ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి చేసిన ట్వీట్‌లో ఇద్దరి పేర్లనే ట్యాగ్ చేశాడు. ఇక్కడ ధోని సిక్సర్ కొట్టిన వీడియోను పెట్టి, అందులో విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్‌లను మాత్రమే ట్యాగ్ చేశాడు. ‘ఆటగాళ్లకు శుభాకాంక్షలు.. మా 1983 బృందంలాగే.. జీవితమంతా ఈ క్షణాలను తలుచుకొని మీరు సంతోషిస్తారు’ అని ట్వీట్ చేశాడు రవిశాస్త్రి
దీనికి యువరాజ్‌కు ఎక్కడో కాలినట్లే కనబడింది. అయితే చిలిపి ఎమోజీలు పెట్టి తన మనసులోని మాటను బయటపెట్టాడు యువీ. ‘నన్ను, ధోనిని ట్యాగ్ చేయడం మరిచావా రవి’ అంటూ లాఫింగ్ ఎమోజీ పెట్టి మరీ అడిగేశాడు. ‘సీనియర్‌కు కృతజ్ఞతలు! మీరు నన్ను, మహీని కూడా ట్యాగ్ చేయొచ్చు. విజయంలో మా భాగస్వామ్యం కూడా ఉంది’ అని యువీ ప్రశ్నించాడు. దీనికి తెలివిగా సమాధానమిచ్చాడు రవి. యువీ అసంతృప్తి చెందిన విషయాన్ని పసిగట్టిన రవిశాస్త్రి.. ‘ప్రపంచకప్ టోర్నీల విషయానికొస్తే నువ్వు జూనియర్ కాదు.. నీకంటే లెజెండ్ ఉన్నారా’ అని యువరాజ్‌కు బదులిచ్చాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఆ టోర్నీలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన యువీ.. భారత్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. (ఆ ఒక్క సిక్సర్‌తో వరల్డ్ కప్ గెలవలేదు!)
Comments
Please login to add a commentAdd a comment