
రోహిత్ శర్మ
బర్త్‌డేలకు అందరూ ఏం చేస్తారు.. హ్యాపీ బర్త్‌డే అని చెబుతారు
లీడ్స్ : భారత హిట్‌మ్యాన్, సెంచరీ హీరో రోహిత్ శర్మ మరోసారి నవ్వులు పూయించాడు. ఇంగ్లండ్ మ్యాచ్ అనంతరం రిషభ్ పంత్‌ను ప్రస్తావిస్తూ చమత్కరించిన రోహిత్.. తాజాగా ధోని బర్త్‌డేపై జోకులు పేల్చాడు. శ్రీలంకతో విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్‌ను ఓ జర్నలిస్టు.. ధోని బర్త్‌డేను ఎలా ప్లాన్ చేస్తున్నారని ప్రశ్నించాడు. దీనికి రోహిత్..‘బర్త్‌డేలకు అందరూ ఏం చేస్తారు.. హ్యాపీ బర్త్‌డే అని చెబుతారు.’ అని తెలపడంతో అక్కడ నవ్వులు పూసాయి.
‘ధోనిబర్త్‌డే రోజే మా ప్రయాణం. కానీ మేం వెళ్తోంది.. బర్మింగ్‌హాం లేక మాంచెస్టర్ అనేది తెలియదు.(అప్పటికి ఆసీస్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితం తేలలేదు). దీంతో బస్సు ప్రయాణంలో ధోనిచేత కేక్ కట్ చేయిస్తాం. ఆ ఫొటోలు మీకు పంపిస్తాం’ అని సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సెంచరీలు, రికార్డులు తనకు సంతృప్తి ఇవ్వవని, భారత్ ప్రపంచకప్ అందుకున్నప్పుడే సంతృప్తి కలుగుతుందని రోహిత్ స్పష్టం చేశాడు.
Is there anyone as candid and funny as @ImRo45? Here's what he had to say when asked about a message for Birthday Boy @msdhoni 😄😁 #TeamIndia #CWC19 #SLvIND pic.twitter.com/aCD23hgKts
— BCCI (@BCCI) July 6, 2019