అత్యంత విజయవంతమైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంఎస్ ధోని పేరు తెచ్చుకోవడం వెనుక మాస్టర్ బ్లాస్టర్ ప్రమేయముందని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చీఫ్ శరద్ పవార్ తెలిపారు. 2007లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు జట్టు కెప్టెన్‌గా ధోనిని నియమిస్తే బాగుంటుందని సచిన్ సలహా ఇచ్చాడని ఆయన తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘2007లో ధోనిని కెప్టెన్‌గా నియమించాలని సచిన్ సూచించాడు.
‘మీరోసారి ప్రయత్నించండి. అతడో గొప్ప కెప్టెన్ కాగలడు. నేనీ విషయాన్ని ఓ బాధ్యతగా చెబుతున్నాను’ అని అన్నాడు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ ధోనిని కెప్టెన్‌ను చేయడం.. అతడు టి20, వన్డే ప్రపంచకప్‌లను అందించడం చరిత్ర. ఇదంతా సచిన్ దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది’అని పవార్ పేర్కొన్నారు.
‘ధోని మంచి కెప్టెన్ అవుతాడని చెప్పాడు’
Published Mon, Nov 11 2013 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
Advertisement
Advertisement