
వచ్చే నెలలో భారతరత్న అందుకోనున్న సచిన్
ఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వచ్చే నెల్లో భారతరత్న అవార్డు అందుకోనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్రపతి చేతులు మీదుగా సచిన్ ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.ఇరవై నాలుగేళ్లుగా క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సచిన్ తన 200వ టెస్టుతో నవంబర్ 16న ఆట నుంచి వైదొలిగారు. అదేరోజు ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. ఇప్పటికే ఆయన పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. క్రీడా ప్రపంచంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అసలైన రాయబారి టెండ్కూలర్ అని కేంద్రం అధికారిక ప్రకటనలో పేర్కొంది.