కౌలూన్: హాంకాంగ్ ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సైనా 8-21, 21-18, 19-21 స్కోరుతో చైనా ప్లేయర్ యి చెంగ్ చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో ఓడిపోయిన హైదరాబాదీ రెండో గేమ్‌ను గెలిచినా.. నిర్ణాయక మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కోల్పోయింది.
కాగా ఈ టోర్నీలో మరో తెలుగుతేజం పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. క్వార్టర్ ఫైనల్లో సింధు 21-17, 21-23, 21-18 స్కోరుతో సింగపూర్ క్రీడాకారిణి లియాంగ్ పై పోరాడి విజయం సాధించింది.
సైనా నెహ్వాల్‌కు నిరాశ
Published Fri, Nov 25 2016 5:47 PM | Last Updated on Sun, Sep 2 2018 3:19 PM
Advertisement
Advertisement