
రాంచీ: క్రికెట్ ఆగిపోయిన వేళ ‘మహర్షి’లా తన పొలం పనులు చేసుకుంటున్నాడు ఎమ్మెస్ ధోని. సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టిన భారత జట్టు మాజీ కెప్టెన్ తన సొంత బ్రాండ్‌తో త్వరలోనే ఎరువులను మార్కెట్‌లోకి తీసుకురానున్నాడు. ధోని 39వ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాలు అతని ఆప్త మిత్రుడు మిహిర్ దివాకర్ వెల్లడించాడు. ‘ధోనికి సుమారు 50 ఎకరాల పొలం ఉంది. అతనికి సైనికుడిగా పని చేయడమన్నా, రైతుగా పని చేయాలన్నా బాగా ఇష్టం. ఇప్పుడతను తన పొలంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. మా వద్ద పలువురు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు కొత్త రకం సేంద్రీయ ఎరువును అభివృద్ధి చేశారు. రెండు, మూడు నెలల్లో నియో గ్లోబల్ పేరుతో మార్కెట్లోకి తెస్తాం. ఇక కరోనా తగ్గి పరిస్థితులు చక్కబడే వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనరాదని ధోని నిర్ణయించుకున్నాడు’ అని మిహిర్ చెప్పాడు.
మరో ఏడాది వయసు పెరిగింది. కాస్త జుట్టు కూడా నెరిసింది. కానీ ఇంకాస్త పరిణతి రావడంతో పాటు మరింతగా ముద్దొస్తున్నావు. ఇలాంటి అభినందనలు, బహుమతులను నువ్వు పట్టించుకోవని తెలుసు. కేక్, క్యాండిల్స్‌తో నీ జీవితపు మరో ఏడాదిని వేడుకగా జరుపుకుందాం. హ్యపీ బర్త్‌డే హజ్బెండ్. –ధోనికి భార్య సాక్షి పుట్టిన రోజు శుభాకాంక్షలు
Comments
Please login to add a commentAdd a comment