సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ | sanju samson gets half century | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ

Published Fri, Apr 28 2017 5:08 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

సంజూ  శాంసన్ హాఫ్ సెంచరీ

సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ

కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 32బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కరుణ్ నాయర్(15) తొలి వికెట్ గా పెవిలియన్ చేరి మరోసారి నిరాశపరిచాడు.

 

అయితే ఆ తరుణంలో మరో ఓపెనర్ సంజూ శాంసన్ కు జత కలిసిన శ్రేయస్ అయ్యర్ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే శాంసన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఢిల్లీ చేసిన 89 పరుగుల్లో 50 పరుగులు శాంసన్ సాధించడం ఇక్కడ విశేషం. అయితే జట్టు స్కోరు 123 పరుగుల వద్ద శాంసన్(60; 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement