
శ్రీలంక 238/7
కొలంబో: బంగ్లాదేశ్‌తో బుధవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు శ్రీలంక ఏడు వికెట్లకు 238 పరుగులు చేసింది. చండిమల్ (86 బ్యాటింగ్), హెరాత్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తమ వందో టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్ టాస్ ఓడిపోయింది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్, మిరాజ్ రెండేసి వికెట్లు తీశారు.