
సీక్రెట్: కోహ్లిని 'చీకూ' ఎందుకంటారో తెలుసా?
టీమిడింయా క్రికెటర్లు ఉత్సాహంగా టీ-20 వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నారు. స్వదేశంలో జరిగే పొట్టి ప్రపంచ కప్ సంగ్రామంలో మళ్లీ జగజ్జెతలుగా నిలిచేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అభిమానులను ఆనందపెట్టే ఓ వెరైటీ వీడియోను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టు చేసింది. 'మెన్ ఇన్ బ్లూ' తమకు నిక్‌నేమ్స్ ఎలా వచ్చాయో, వాటి వెనుక ఉన్న సీక్రెట్స్ ఏమిటో వివరించారు.
మహీ, చీకూ, సోనూ, అజ్జు, షానా ఇలా టీమిండియా క్రికెటర్లందరికీ ముద్దుపేర్లు ఉన్నాయి. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనకు 'మహీ' అనే ముద్దుపేరు ఉందని, తన పూర్తి పేరును కట్‌చేసి షార్ట్‌కట్‌లో 'మహీ' అని పిలుస్తుండటంతో తనకు ఈ నిక్‌నేమ్ వచ్చిందని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లి తన ముద్దుపేరు 'చీకూ' అని చెప్పాడు. చిన్నప్పుడు తాను పెద్ద చెవులతో బొద్దుగా ఉండేవాడినని, దీనికితోడు చిన్నగా కటింగ్ చేయించుకునేవాడినని, చంపక్ కామిక్స్‌లో 'చీకూ' అనే కుందేలులా ఉన్నానని తనకు ఢిల్లీలో ఓ కోచ్ ఈ ముద్దుపేరు పెట్టాడని వెల్లడించాడు.
అలాగే యువరాజ్ తన ముద్దుపేరు 'యూవీ' అని, హర్భజన్‌సింగ్ తన నిక్‌నేమ్ 'భజ్జీ' అని చెప్పగా.. రవీంద్ర జడ్జేజా తన ముద్దు పేరు 'జెడ్డూ' అని, రోహిత్ శర్మ తన నిక్‌నేమ్ 'షానా' అని, సురేశ్ రైనా తన సరదా పేరు 'సోనూ' అని, రహనే తన ముద్దుపేరు 'అజ్జు' అని వెల్లడించారు. ఇంకా మిగతా టీమిండియా క్రికెటర్లు కూడా తమ ముద్దు పేర్లను ముద్దుముద్దుగా వెల్లడించారు.
Mahi, Cheeku, Sonu, Ajju, Shana - the story behind the nicknames of #TeamIndia members http://www.bcci.tv/videos/id/2052/know-your-stars-the-story-behind-nicknames
Posted by Indian Cricket Team on Sunday, March 6, 2016