పాక్‌పై భారత్‌ విజయానికి కారణం అదే: అఫ్రిది | Shahid Afridi credits IPL after India beat Pakistan | Sakshi
Sakshi News home page

‘ఆ గెలుపు క్రెడిట్‌ అంతా ఐపీఎల్‌దే’

Published Mon, Jun 17 2019 5:02 PM | Last Updated on Mon, Jun 17 2019 5:27 PM

Shahid Afridi credits IPL after India beat Pakistan - Sakshi

కరాచీ: వరల్డ్‌కప్‌లో భారత్‌ చేతిలో తమ జట్టు ఘోర వైఫల్యం చెందడంపై పాకిస్తాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. ప్రస్తుత పాక్‌ క్రికెట్‌ జట్టుపై విమర్శలు చేయకుండానే సుతి మెత్తగా మందలించాడు. మ్యాచ్‌లు గెలవాలంటే 40 నుంచి 50 పరుగులు చేస్తే సరిపోదని, వాటిని భారీ స్కోర్లుగా మలుచుకున్నప్పుడే విజయాలు సాధ్యమనే విషయం గుర్తించుకోవాలన్నాడు. విజయాలు సాధించాలంటే నిలకడగా ఆడటంతో పాటు కూల్‌ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిత బోధ చేశాడు. ప్రధానంగా ఫీల్డింగ్‌ అనేది మ్యాచ్‌లు గెలవడంలో  కీలక పాత్ర పోషిస్తుందని, 70 నుంచి 80 శాతం మ్యాచ్‌లు ఫీల్డింగ్‌తోనే గెలుస్తాయనే విషయం తెలుసుకోవాలన్నాడు.

అదే సమయంలో భారత క్రికెట్‌ జట్టుపై, బీసీసీఐపై అఫ్రిది ప్రశంసలు కురిపించాడు.‘ ఓ గొప్ప విజయం సాధించినందుకు బీసీసీఐకి అభినందనలు. మీ క్రికెట్‌ ప్రమాణాలు చాలా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి.  మీరు వరుస విజయాలు సాధించడానికే ఐపీఎల్ ప్రధానం కారణం. పాక్‌పై మీరు సాధించిన విజయం క్రెడిట్‌ అంతా ఐపీఎల్‌కే దక్కుతుంది.  ఐపీఎల్‌ ద్వారా కేవలం ఆటగాళ్లు నైపుణ్యం బయటకు రావడమే కాదు.. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో ఎలా సన్నద్ధం కావాలనే విషయాన్ని భారత యువ క్రికెటర్లు బాగా తెలుసుకున్నారు. దాంతోనే విజయాలు సాధించడం భారత్‌ క్రికెట్‌ జట్టుకు పరిపాటిగా మారింది’ అని అఫ్రిది కొనియాడాడు.

ఇక్కడ చదవండి: భారత్‌ పరాక్రమం.. పాక్‌ పాదాక్రాంతం

కోహ్లికి ఎందుకంత తొందర?

మా కెప్టెన్‌కు బుద్ధి లేదు : అక్తర్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement