శిఖర్ ధావన్ ఐదవ సెంచరీ
భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి సత్తా చూపించాడు. వెస్టిండీస్ తో కాన్పూర్ లో జరుగుతున్న చివరి వన్డేలో ధానన్ చెలరేగి సెంచరీ సాధించాడు. 264 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ధావన్ శుభారంభాన్ని అందించాడు. కేవలం 73 బంతుల్లో 19 ఫోర్లతో వన్డేల్లో తన ఐదవ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
ఇటీవల కాలంలో నిలకడగా భారత ఓపెనర్ శిఖర్ రాణిస్తేనే.. దూకుడుతో ముందుకు దూసుకుపోతున్నాడు. సెహ్వగ్ తర్వాత అదే దూకుడును ప్రదర్శిస్తూ..ప్రత్యర్థి ఆటగాళ్లకు ప్రమాధకరంగా మారాడు. ఇటీవల కాలంలో భారీ లక్ష్య ఛేదనలో ధావన్ అందించిన శుభారంభాలు భారత్ విజయంలో కీలక పాత్రను పోషించాయి. కాన్పూర్ లో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో 90 బంతుల్లో 20 ఫో్ర్లతో 119 పరుగులు సాధించి మారోసారి భారత్ కు విజయాన్ని అందించాడు.