
10 ఓవర్లు.. 3 మెయిడిన్లు!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో కీలక మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించిన దక్షిణాఫ్రికా బౌలింగ్ లో మాత్రం సత్తాను చాటుతోంది. 192 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సఫారీలు పదునైన బంతులను సంధిస్తున్నారు. తొలి పది ఓవర్లలో మూడు మెయిడిన్లు వేసి భారత్ పై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ను మెయిడిన్ తో ఆరంభించిన రబడా.. ఏడు ఓవర్ లో కూడా పరుగులేమీ ఇవ్వకుండా మెయిడిన్ చేశాడు.
ఆపై మోర్నీ మోర్కెల్ వేసిన ఎనిమిదో ఓవర్ సైతం మెయిడిన్ కావడంతో భారత్ స్కోరు మందగించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆపై బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(12) మొదటి వికెట్ గా అవుటయ్యాడు.