
స్నేహానికి ‘హద్దు’లుండవ్..!
ఈ ఫొటోలో ప్రత్యేకతేముంది? ఇద్దరు కొరియా అమ్మాయిలు సెల్ఫీ దిగుతున్నారు.. అంతే కదా అనిపిస్తోంది కదూ. ఈ ఇద్దరిలో ఎరుపు, తెలుపు రంగు జెర్సీ ధరించిన అమ్మాయిది ఉత్తర కొరియా. మరొకరిది దక్షిణ కొరియా. ఇప్పుడర్థమైంది కదా అసలు విషయం. తమ రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం గురించి ఏమాత్రం ఆలోచించని ఈ అథ్లెట్లు ఒలింపిక్స్ విలేజ్‌లో ఇలా ఫొటో దిగి అసలు సిసలు స్నేహాన్ని లోకానికి చాటుకున్నారు.
అయితే తన పక్క దేశం నీడను సైతం భరించలేని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తాడోనని ఆ ఫొటో చూసినవారే హడలిపోతున్నారు. గేమ్స్ అనంతరం ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలని ఇప్పటికే సోషల్ మీడియాలో సానుభూతి కూడా వ్యక్తమవుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.