సెహ్వాగ్ జట్టుదే ఎంసీఎల్ టైటిల్ | Spectacular Gemini Arabians win maiden MCL title | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్ జట్టుదే ఎంసీఎల్ టైటిల్

Published Mon, Feb 15 2016 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

సెహ్వాగ్ జట్టుదే ఎంసీఎల్ టైటిల్

సెహ్వాగ్ జట్టుదే ఎంసీఎల్ టైటిల్

భారత మాజీ క్రికెటర్  వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని జెమినీ అరేబియన్స్ జట్టు మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ టైటిల్ సాధించింది. ఫైనల్లో ఈ జట్టు లియో లయన్స్‌పై 16 పరుగుల తేడాతో గెలిచింది. ఎంసీఎల్ తొలి సీజన్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సెహ్వాగ్ సేన... ఫైనల్లో 20 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు చేసింది. కెంప్ (32), సంగక్కర (30) రాణించారు. తర్వాత లయన్స్ 19.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటయింది. హమీష్ మార్షల్ (46) మినహా అందరూ విఫలమయ్యారు. నవీద్ ఉల్ హసన్ నాలుగు వికెట్లు తీశాడు. సంగక్కరకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.

Advertisement
Advertisement