జెమినీ అరేబియన్స్ కెప్టెన్‌గా సెహ్వాగ్
మాస్టర్స్ చాంపియన్స్ లీగ్
దుబాయ్: మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్)లో పాల్గొనే జెమినీ అరేబియన్స్ జట్టుకు డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా, టీమ్ డెరైక్టర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు టీమ్ ప్యాట్రన్ మేధా అహ్లువాలియా ఈ విషయాన్ని ప్రకటించారు. జట్టుకు సంబంధించిన లోగో, జెర్సీలను ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ దుబాయ్‌తో పాటు ఇతర నగరాల్లో ఆవిష్కరించారు. విభిన్న తరహాలో జట్టును పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశామని టీమ్ యజమాని, సీఈఓ నళిన్ ఖైతాన్ అన్నారు.
జెమినీ జట్టులో సంగక్కర, చందర్‌పాల్, బ్రాడ్ హాగ్, జస్టిన్ కెంప్, మురళీధరన్, మిల్స్, రాణా నవీద్, ఆశిష్ బగాయ్‌లాంటి మాజీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లను తిరిగి బరిలోకి దించాలనే ఉద్దేశంతో రూపొందించిన ఎంసీఎల్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉంటాయి. ప్రతి ఫ్రాంచైజీ తరఫున జట్టు బరిలోకి దిగుతుంది. మొత్తం 250 మంది మాజీలు ఈ టోర్నీలో భాగం పంచుకుంటున్నారు. దుబాయ్, షార్జాల్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.