బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంకకు 182 పరుగుల ఆధిక్యం లభించింది.
గాలే: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంకకు 182 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు 133/2 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 97.2 ఓవర్లలో 312 పరుగుల వద్ద ఆలౌటైంది. ముష్ఫీకర్ రహీమ్ (85), సౌమ్య సర్కార్ (71), హసన్ మిరాజ్ (41) రాణించారు. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగడంతో మూడో రోజు కేవలం 51.2 ఓవర్ల ఆటే సాగింది.