సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ ఆఫ్ క్రికెట్ అకాడమీస్ (ఎఫ్‌సీఏ) అండర్-19 ట్రోఫీని సెయింట్ జాన్స్ కోచింగ్ ఫౌండేషన్ జట్టు చేజిక్కించుకుంది. శనివారం విజయానంద్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో సెయింట్ జాన్స్ 73 పరుగుల తేడాతో ఉదిత్యాల్ క్రికెట్ అసోసియేషన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ జాన్స్ 40 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది.
యశ్వంత్ రెడ్డి (63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పాటు నిఖిల్ యాదవ్ (37) రాణించాడు. జునేద్ అలీ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఉదిత్యాల్ 31.5 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్ ఖాలెద్ ఖురేషీ (68) చెలరేగినా లాభం లేకపోయింది. నిఖిల్ దీప్ (3/33) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అబ్దుల్ రహమాన్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా, ఎంఏ అర్షద్ బెస్ట్ బౌలర్‌గా నిలిచారు. టోర్నీ ఫైనల్ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌ను ఎఫ్‌సీఏ సభ్యులు సన్మానించారు.
సెయింట్ జాన్స్‌కు ఎఫ్‌సీఏ టైటిల్
Published Sun, May 25 2014 12:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement